- అవి నీళ్లు తాగడానికి 15 వేల నీటి పాత్రలను ఏర్పాటు చేసినం
నారాయణగూడ, వెలుగు: నారాయణగూడ మేల్కొటే పార్క్లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి కలెక్టర్ హరి చందన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో జంతువులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు 4 మల్టీ-స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులో ఉన్నాయన్నారు.
జంతువులపై అవగాహన కోసం సేఫ్ విత్ డాగ్స్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సిటీ వ్యాప్తంగా 15 వేల నీటి పాత్రలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పశుసంవర్ధక శాఖ అడిషనల్డైరెక్టర్డాక్టర్ సుబ్బారాయుడు, అడిషనల్కలెక్టర్ జితేందర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

